ఐదో రోజు ఆట‌కూ వ‌రుణ‌గండం.. మ్యాచ్‌ డ్రా అయ్యేనా..?

ఐదో రోజు ఆట‌కూ వ‌రుణ‌గండం.. మ్యాచ్‌ డ్రా అయ్యేనా..?

Summarize with AI

ఆస్ట్రేలియా-భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వర్షం రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం ఐదోరోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జల్లులతోపాటు, ఉరుములతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి.

ఈ వర్ష సూచనల కారణంగా గబ్బా టెస్టు ఫలితం డ్రా అయ్యే అవకాశాలు మరింతగా క‌నిపిస్తున్నాయి. రెండు జట్లు కీలకమైన సమరానికి సిద్ధంగా ఉన్నా, వాతావరణం ఈ మ్యాచ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 445 ప‌రుగులు చేయ‌గా, మొద‌టి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 252 ప‌రుగుల‌కు 9 వికెట్లు న‌ష్ట‌పోయింది. ప్ర‌స్తుతం క్రీజ్‌లో అక్ష‌దీప్‌, బూమ్రా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment