ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య

ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య

Summarize with AI

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు రక్తపాతం దాకా వెళ్లాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న, ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించేందుకు వెళ్లే క్రమంలో ప్రత్యర్థులు అతనిపై ఘోరంగా దాడి చేశారు.

వేట కొడవలితో దాడి చేసి ఈరన్నను హతమార్చి, అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో హత్య చేసినట్లు వెల్లడైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. అధికారుల మధ్య స్థానిక రాజకీయాలు ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment