కలియుగంలో మానవ సంబంధాలు మంటగలిచి పోతున్నాయన్నదానికి ఈ ఘటన నిలువెత్తు ఉదాహరణ. కొమురు భీం ఆసీఫాబాద్ (Komaram Bheem Asifabad) జిల్లా సిర్పూర్ మండలంలోని టోంకినికి (Tonkiniki) గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.
గ్రామానికి చెందిన రైతు చిరంజీవి (Chiranjeevi) తన పొలాలను వన్యప్రాణుల నుంచి రక్షించేందుకు విద్యుత్ ఫెన్సింగ్ (Electric Fencing) ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఆయన 19 ఏళ్ల కుమారుడు జయేందర్ (Jayender) పొలానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు విద్యుత్ ఫెన్సింగ్‌ను తాకి అక్కడికక్కడే మృతి చెందాడు (Died On The Spot). అయితే ఈ విషాదాన్ని పోలీసులకు చెబితే నేరం (Crime) తనమీదికి వస్తుందని భయపడిన చిరంజీవి, కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలియనివ్వకుండా కన్న కొడుకు (Own Son) మృతదేహాన్ని పెనుగంగ నది (Penganga River) లో పడేశాడు.
ఇంతలో తాను ఎటువంటి సమాచారం లేకుండా కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ రంగంలోకి దిగిన పోలీసులు (Police) చివరికి పెనుగంగ నదిలో జయేందర్ డెడ్‌బాడీ (Dead Body) ని గుర్తించారు. మృతదేహంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు చిరంజీవిని ప్రశ్నించగా నిజాన్ని(Truth) ఒప్పుకొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు చిరంజీవితో అతనికి సహకరించిన చెలిరాం (Cheliram) అనే మరో వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు