రాజ్యసభలో ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “నువ్వు రైతు బిడ్డవైతే, నేను కూలీ బిడ్డను” అని వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం రాజ్యసభ సమావేశాలు అలహాబాద్ జడ్జి అభిశంసనపై చర్చతో ప్రారంభమయ్యాయి. సభ్యుల నినాదాలతో సభ గందరగోళంగా మారింది. దీనిపై స్పందించిన చైర్మన్ ఎంపీలుగా మీరు గందరగోళం చేస్తే ఒక రైతు బిడ్డగా నేను తట్టుకోగలను అని అన్నారు. వెంటనే స్పందించిన ఖర్గే.. మీరు రైతు బిడ్డ అయితే, నేను కూలీ బిడ్డను అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన రాజ్యసభలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఖర్గే వ్యాఖ్యలు, ధన్కర్ ప్రతిస్పందనతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.