ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)పై హైకోర్టు (High Court) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.
ఈ నెల 26వ తేదీకి ముందు కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government), హోంశాఖ, డీజీపీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఇరకాటంలో పడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జోగి రమేష్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. “సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోంది. విచారణలో న్యాయం జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐకే నకిలీ మద్యం కేసు విచారణ అప్పగించాలి” అని వాదించారు. సీబీఐ విచారణ కోరిన వ్యక్తినే నిందితుడిగా చూపించి అరెస్ట్ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం అని పొన్నవోలు వాదించారు.
హైకోర్టు ఈ వాదనలపై సీరియస్‌గా స్పందించింది. సిట్(SIT) విచారణలో ఏమి జరుగుతోందో, సీబీఐకి కేసు బదిలీ చేయాలా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణలో ఇకపై ఎలాంటి జాప్యం చేయరాదని, స్పష్టమైన నివేదికను సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఈ పరిణామంతో, ఏపీ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది.








