వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీలో ఫహద్ ఔట్.. కార్తీ ఇన్?

వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీలో ఫహద్ ఔట్.. కార్తీ ఇన్?

హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) – విక్టరీ వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఈ చిత్రంలో కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం ముందుగా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ (Fahadh Faasil)ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, భారీగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు టాక్. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఫహద్ తప్పుకున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఫహద్ స్థానంలో తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) పేరు బలంగా వినిపిస్తోంది. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తీ, గతంలో ‘ఊపిరి’తో మెప్పించాడు. వెంకటేష్-కార్తీ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని భావిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా లాంచ్ చేసి, 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్‌లుగా కీర్తి సురేష్, పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment