ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి 10:56 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ఘటనతో భయంతో వెలుపలికి పరుగులు తీసిన ప్రజలు, గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి భూమి స్వల్పంగా కంపించిందని తెలిపారు. ఈ పరిణామాలు స్థానికులలో ఆందోళన రేకెత్తించాయి. 2019 అక్టోబర్లో ఇలాంటి భూ ప్రకంపనలు నమోదైనట్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
News Wire
-
01
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
హీట్ వేవ్ అలెర్ట్స్ జారీ. 5 రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వడగాల్పులు. కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్.
-
02
త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ
కేబినెట్ లో చేరనున్న కాంగ్రెస్, IUML, VCK. AIADMK రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులంటూ ప్రచారం
-
03
అనంతపురం లో యువకుడికి దేహశుద్ధి
విడపనకల్లో యువకుడికి గుండుకొట్టి ఊరేగించిన గ్రామస్తులు. ప్రేమ పేరుతో వివాహితను వేధించిన యువకుడు
-
04
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్నహుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
-
05
ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
5 దేశాల పర్యటనలో భాగంగా రోమ్ కు చేరుకున్న మోదీ. ఇటలీ ప్రధాని మెలోనితో మోదీ భేటీ.
-
06
లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
లక్నోపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు. స్కోర్లు: లక్నో 220/5, రాజస్థాన్ 225/3
-
07
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
08
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
09
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
10
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు








