ట్రాక్టర్లు ఎలా ఉంటాయి, ఎలా నడుస్తాయో మనందరికీ బాగా తెలుసు. కానీ, మీరు చూసే ఈ రోబో ట్రాక్టర్ కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా. జపానీస్ కంపెనీ ‘కుబోటా ట్రాక్టర్ కార్పొరేషన్’ రూపొందించిన ‘కుబోటా ఆల్ టెరేన్ రోబో-కేఏటీఆర్’ ఇప్పుడు ప్రపంచంలో సెన్సేషనల్‌గా మారింది.
ఈ రోబో ట్రాక్టర్ ను నడపడానికి డ్రైవర్ అవసరం లేదు! అవును, ఇది నిజమే. దీని స్పెషలిటీ ఏంటంటే, ఇది అన్ని రకాల నేలల మీద సులభంగా ప్రయాణిస్తుంది. సమతల నేలల మీదనే కాకుండా, ఎగుడు-దిగుడు నేలల మీద కూడా ప్రయాణించగలదు.
అధునాతన సాంకేతికత
ఈ ట్రాక్టర్‌కు అమర్చిన అధునాతన సెన్సర్లు, అత్యాధునిక కెమెరా వ్యవస్థలు, దిశను గుర్తించడానికి మరియు అవరోధాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవి. ఇది డీజిల్‌తో, అలాగే బ్యాటరీతో పనిచేయగలదు. ఈ ట్రాక్టర్ సులభంగా 130 కిలోల బరువును మోసుకురాగలదు, కాబట్టి చిన్న చిన్న పొలం పనులకు కూడా ఇది పనికొస్తుంది. అన్ని కుదిరితే ఇది త్వరలో బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.








