మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) త్వరలో రాజ్యసభ (Rajya Sabha)లో అడుగు పెట్టనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో MNM పార్టీ అధికార డీఎంకే (DMK)తో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ అంశంపై తాజాగా డీఎంకే ప్రభుత్వంలోని ఒక మంత్రి, అధికార ప్రతినిధి స్పందిస్తూ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, MNM నుంచి మరొక వ్యక్తికి కూడా ఈసారి అవకాశం లభించనున్నట్లు తెలిపారు.
సినీ కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తూనే రాజకీయంగా MNM పార్టీ ద్వారా కమల్ హాసన్ తనదైన ముద్ర వేశారు. 2018లో MNM స్థాపించినప్పటి నుండి, ఆయన ప్రజాసేవలో చురుకుగా ఉన్నారు. ఈ రాజ్యసభ అవకాశం ఆయన రాజకీయ ప్రయాణానికి కొత్త దిశను ఇస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.