‘DxV’ అంటూ ధనుష్ సస్పెన్స్.. కొత్త సినిమా అనౌన్స్‌మెంటా?

'DxV' అంటూ ధనుష్ సస్పెన్స్.. కొత్త సినిమా అనౌన్స్‌మెంటా?

Summarize with AI

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్మ(Dhanush)రోసారి తన సోషల్ మీడియా పోస్టుతో అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తించారు. ఇటీవల ‘కర’ (Kara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ప్రస్తుతం దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓమ్’(OM) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన ఎక్స్ (X) ఖాతాలో ‘DxV’ అనే అక్షరాలతో ఉన్న ఓ మిస్టీరియస్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, జూలై 10న పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. అంతరిక్షం లేదా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్టర్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. అసలు ‘DxV’ అంటే ఏమిటి? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘V’ అంటే దర్శకుడు వెంకట్ ప్రభు అని, ధనుష్-వెంకట్ ప్రభు (Dhanush–Venkat Prabhu)కాంబినేషన్‌లో భారీ సైన్స్ ఫిక్షన్ లేదా టైమ్ ట్రావెల్ సినిమా రాబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ‘12త్ ఫెయిల్’ దర్శకుడు **విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) తో ధనుష్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ధనుష్ తన తదుపరి దర్శకత్వ చిత్రాన్ని లేదా ఎప్పటి నుంచో చర్చలో ఉన్న ‘వేల్పారి’ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారా? అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ‘DxV’ వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే జూలై 10 వరకు వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment