దేశ రాజధానిలో (National Capital) కాలుష్యాన్ని(Pollution) తగ్గించడంతో పాటు ఇంధన పొదుపు (Fuel Saving) దిశగా ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ‘నా భారతదేశం – నా కర్తవ్యం'(‘My India – My Duty’) ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రి రేఖ గుప్త (Chief Minister Rekha Gupta) కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ భాగస్వాములు అయ్యేలా రూపొందించిన ఈ నిబంధనలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.
ఉద్యోగులకు ఊరట.. వాహనాలకు బ్రేక్
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై వారానికి రెండు రోజులు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా (Work From Home) వీలు కల్పించారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఉద్యోగుల ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను (Transport Allowance) 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం వస్తే ‘మండే మెట్రో’నే!
ప్రభుత్వ పెద్దలు, అధికారులు విలాసాలకు స్వస్తి చెప్పి సామాన్యుల్లా ప్రయాణించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఢిల్లీ మెట్రోలోనే ప్రయాణించి కార్యాలయాలకు చేరుకోవాలి. సామాన్య ప్రజలు కూడా వారంలో ఒక రోజును ‘నో వెహికల్ డే'(‘No Vehicle Day’)గా పాటించి సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
సీఎం కాన్వాయ్‌లో మార్పులు
ఆడంబరాలకు పోకుండా ముఖ్యమంత్రి స్వయంగా పొదుపు చర్యలు ప్రారంభించారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను కేవలం నాలుగింటికే పరిమితం చేశారు. అందులోనూ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఉండేలా చూస్తున్నారు. ప్రభుత్వపరంగా విదేశీ ప్రయాణాలను ఏడాది పాటు పూర్తిగా రద్దు చేశారు. వచ్చే ఆరు నెలల వరకు ప్రభుత్వం తరపున ఎటువంటి పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయకూడదని కేబినెట్ నిర్ణయించింది. ఉన్న వనరులనే సమర్థవంతంగా వాడుకోవాలని స్పష్టం చేసింది.








పొదుపు సూక్తులు పరులకేనా మంత్రి గారూ? – నెటిజన్ల ప్రశ్న