తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister) విజయ్ (Vijay) మరోసారి తన సరళమైన రాజకీయ శైలితో ప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటిష్ కాలం (British Era) నుంచి కొనసాగుతున్న ‘వీఐపీ కల్చర్’కు(VIP Culture) ప్రతీకగా భావించే కుర్చీలపై తెల్లటి టవల్ (White Towel) సంప్రదాయాన్ని తన కార్యాలయంలో తొలగించి కొత్త సందేశం ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండాలనే తన ఆలోచనను ఈ చిన్న నిర్ణయంతో స్పష్టం చేశారు. అధికారిక ప్రకటనలు లేకుండా, ఎలాంటి ప్రచారం చేయకుండా నిశ్శబ్దంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.
ఈ మార్పుకు కారణం 14 ఏళ్ల క్లైమేట్ యాక్టివిస్ట్ లిసిప్రియా కంగుజం (Licypriya Kangujam) చేసిన ఒక సోషల్ మీడియా అప్పీల్. “వీఐపీ కుర్చీలపై తెల్ల టవల్ సంస్కృతిని ముగించండి సర్” అంటూ ఆమె చేసిన విజ్ఞప్తికి విజయ్ స్పందించారు. కేవలం 24 గంటల్లోనే సెక్రటేరియట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో టవల్ లేని కుర్చీలో విజయ్ కూర్చున్న ఫోటోలను సీఎం కార్యాలయం విడుదల చేసింది. దీంతో యువత, నెటిజన్ల నుంచి విజయ్‌కు భారీ ప్రశంసలు లభిస్తున్నాయి. “చిన్న మార్పులే పెద్ద సంస్కరణలకు నాంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
తెల్ల టవల్ సంప్రదాయం బ్రిటిష్ కాలం నాటి పరిపాలనా విధానాల్లో భాగంగా మొదలైందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఏసీలు లేని రోజుల్లో అధికారులు ప్రయాణాల తర్వాత చెమట తుడుచుకోవడానికి, పరిశుభ్రత కోసం కుర్చీలపై తెల్ల టవల్స్ వేసేవారు. కానీ కాలక్రమేణా అది అధికారం, హైరార్కీ, వీఐపీ స్టేటస్‌కు చిహ్నంగా మారిపోయింది. ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయం కాలనీయ భావజాలానికి చెక్ పెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రజలకు చేరువైన రాజకీయ సంస్కృతికి ఇది కొత్త సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.









పవన్ కళ్యాణ్ మీకిది తగునా..? విశ్లేషకుల సూటి ప్రశ్నలు