కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుండ‌గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘క్యాబినెట్‌లో ఎవరు ఉండాలో నిర్ణయం పూర్తిగా అధిష్టానానిదే. నేను ఎవరి పేరును ప్రతిపాదించడం లేదు’ అని తెలిపారు.

అలాగే, ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు సాగుతుందని చెప్పారు. ‘త్వరగా అరెస్ట్ చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన బాధ్యతను మాత్రమే నెరవేర్చుతున్నాను. నా పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు’ అని అన్నారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌కు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పింద‌ని, లిస్ట్ కూడా ఫైన‌లైజ్ చేసింద‌న్న వార్త‌ నిన్న‌టి నుంచి తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో కేబినెట్ విస్త‌ర‌ణ ఇప్పుడ‌ప్పుడే తెగే అంశం కాద‌ని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment