అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. – సీఎం చంద్ర‌బాబు

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. - సీఎం చంద్ర‌బాబు

Summarize with AI

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం.. పండగ సందర్భంగా ఊరెళ్లి ప్రజలతో సంతోషంగా గడపాలన్నారు. ఈ సంద‌ర్భంగా తాను నారావారిప‌ల్లెకు ఎందుకు వెళ్తారో కూడా చెప్పారు.

‘‘పండగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సొంత ఊర్ల‌కు వెళ్లి తమ మిత్రులతో, కుటుంబ సభ్యులతో కలవటం ఒక గొప్ప అలవాటుగా మారాలి. నేను ప్రతి సంక్రాంతికి మా ఊరికి వెళ్ళి, అక్కడి ప్రజలతో సమయం గడపడం ఆనందంగా అనిపిస్తుంది. ఈ సంప్రదాయం పాతికేళ్ల క్రితం భువనేశ్వరి ప్రారంభించారు. ఆమె పట్టుదలతోనే ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం’’ అన్నారు.

పీ4 కాన్సెప్ట్ పేపర్..
అలాగే, పీ4 కాన్సెప్ట్ పేపర్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఈ పేపర్‌పై అన్ని స్థాయిల్లో చర్చలు జరగాల‌ని చంద్రబాబు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment