సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటిలో పర్యటించారు. పింఛన్ల పంపిణీ అనంతరం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజావేదిక సభలో పలువురు విద్యార్థుల చేత మాట్లాడించారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రకటించాలని సభలో నినదించాడు.
దీంతో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. `ఏయ్ కూర్చో నువ్వు చెబితే ప్రకటించేస్తారా.. ఆ కుర్రాడికి భవిష్యత్ ఉండాలంటే వీళ్లని చూసి నేర్చుకోవాలి పోకిరోడు మాదిరిగా తిరిగితే లాభం ఏంటి ? ఏం వస్తుంది అతనికి అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ ప్రకటించాలనడం పోకితనం అవుతుందా..? అని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారు అక్కడక్కడా ఉంటారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీ కోసం నినదించిన వారిని సభను అడ్డుకునేవారిగా చిత్రీకరించేలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.