ధన దాహం కోసం నేలమ్మను, పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతిని మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. చిత్తూరు (Chittoor) జిల్లా జీడి నెల్లూరు (J.D.Nellore) నియోజకవర్గంలో గ్రావెల్ దందా (Gravel Mafia) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ దందాకు స్థానిక కూటమి నేతలే అండగా నిలుస్తున్నారని ఇటీవల ఆ ప్రాంతంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం (Telugu Desam) పార్టీ(Party) ఎమ్మెల్యే(MLA) అండతో ఆయన అనుచరులు ఎర్ర మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ పరిధిలో నుంచి అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వి తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం చెన్నై(Chennai)కి భారీ ఎత్తున తరలిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా టిప్పర్ లారీల ద్వారా ఎర్ర మట్టి రవాణా జరుగుతున్నా, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ అక్రమ మైనింగ్ కారణంగా స్థానికులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. రాత్రివేళ లారీల మోతతో ఊరికి నిద్ర లేకుండా పోతుందని, ప్రకృతి సంపదను దోచుకుంటూ కొందరు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సీపీఐ నేతల ఆందోళన..
ఇటీవల జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ (MLA Thomas) అనుచరుల అక్రమ మైనింగ్‌పై సీపీఐ(CPI) నేతలు రామానాయుడు (Ramanayudu), నాగరాజు (Nagaraju) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎస్.ఆర్.ఆర్ ఖండ్రిగ, సాయినగర్, చింతకణం, అత్తిమంజరి పేట, వేపకోన గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ను వారు పరిశీలించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాల మధ్య పాలసముద్రం మండలంలో వెలుగులోకి వచ్చిన అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తహసీల్దార్ అరుణకుమారి పరిశీలన చేపట్టి, జరుగుతున్న మైనింగ్ దందాను బయటపెట్టారు. మైనింగ్ అక్రమాలపై తహసీల్దార్ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 8, 2025
చిత్తూరు జిల్లాలో యథేశ్చగా గ్రావెల దందా
జీడి నెల్లూరులో రాత్రీ, పగలు కొనసాగుతున్న గ్రావెల్ అక్రమ దందా.. స్థానికులు ఆందోళన
పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ నుంచి అక్రమంగా తమిళనాడు రాష్ట్రం చెన్నైకి తరలిపోతున్న ఎర్ర మట్టి
భారీ ఎత్తున టిప్పర్… pic.twitter.com/wlu1LtLS9G