చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్‌పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?

చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్‌పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?

Summarize with AI

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశవ్యాప్తంగా కొత్తగా 200 జైళ్లను నిర్మించాల‌ని ప్ర‌క‌టించ‌డం సంచలనంగా మారింది. ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వ విధేయతలో లేని వ్యక్తులు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు అన్నమాటపై వివాదం రేగుతోంది.

వ్యాపారవేత్తల నుంచి నిపుణుల వరకు..
సీఎన్ఎన్ వెల్లడించిన కథనం ప్రకారం.. జిన్‌పింగ్ దృష్టి సారించిన వారి జాబితాలో వ్యాపారవేత్తలు, స్కూళ్లు-ఆస్పత్రుల యజమానులు, వివిధ రంగాల నిపుణులు కూడా ఉన్నారు. అవినీతి పేరిట వారిపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ జైళ్లు కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి విశ్వాసం చూపనివారి కోసం కట్టిస్తున్న‌ట్లు నివేదికలు చెబుతున్నాయి.

జైళ్ల నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం దేశంలో అధికార పటిష్టతకు సంబంధించిందా లేక ప్రజలపై నియంత్రణ పెంచడానికా అన్నది చర్చనీయాంశమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment