ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) భద్రతా కాన్వాయ్‌లో(Security Convoy) త్వరలో కొత్త వాహనాలు (New Vehicles) చేరనున్నాయి. ముఖ్యమంత్రి సెక్యూరిటీ కోసం ఆరు ఫోర్స్ ఆర్బానియా (Force Urbania) వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1.78 కోట్లకు పైగా నిధులు (Funds) కేటాయిస్తూ హోంశాఖ (Home Department) ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబు భద్రతా కాన్వాయ్ కోసం ఫోర్స్ ఆర్బానియా 4400 WB మోడల్‌కు చెందిన ఆరు వాహనాలను కొనుగోలు చేయనున్నారు. వీటి కోసం ప్రభుత్వం (Government) మొత్తం రూ.1,78,05,000 అదనపు నిధులను కేటాయించింది. ఈ లెక్కన ఒక్కో వాహనం సగటు ధర రూ.29.67 లక్షలుగా ఉంది.
ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్ ద్వారా ఈ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాన్వాయ్‌లో ఉపయోగిస్తున్న టయోటా వాహనాల స్థానంలో వీటిని వినియోగించనున్నారు.
గతంలో వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం జారీ చేసిన నిషేధ ఉత్తర్వుల నుంచి ఈ ప్రతిపాదనకు మినహాయింపు ఇచ్చింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం ఆరు వాహనాల కోసం అదనపు నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం (Debt Burden) గురించి చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి భద్రతా కాన్వాయ్ కోసం రూ.1.78 కోట్లకు పైగా ఖర్చు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.










