టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ పాకిస్తాన్‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ పాకిస్తాన్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో కీల‌క మైన భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ మొద‌లైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొద‌ట‌గా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో విజ‌యం సాధించిన టీమ్‌తోనే బ‌రిలోకి దిగుతుంది. పాకిస్తాన్ మాత్రం ప్లేయింగ్ లెవ‌న్‌లో ఒక ప్లేయ‌ర్‌ను మార్చింది. టాస్ ఓడిపోయిన‌ప్ప‌టికీ మొద‌టి మ్యాచ్ ఎక్స్‌పీరియ‌న్స్ త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దుబాయ్ పిచ్‌లో బంగ్లాతో జ‌రిగిన ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఛేజింగ్‌కి విజ‌యం సాధించామ‌ని రోహిత్ అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రికొన్ని క్ష‌ణాల్లో లైవ్ యాక్ష‌న్ స్టార్ట్ అవ్వ‌బోతోంది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓట‌మి చ‌విచూసింది. టీమిండియా బంగ్లాదేశ్‌ను ఫ‌స్ట్ మ్యాచ్ చిత్తుచేసి మంచి జోష్‌మీద ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment