చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తాచాటారు.
Important Announcement: CA. Ranjeet K. Agarwal, President, and CA. Charanjot Singh Nanda, Vice President, along with ICAI Exam Committee Members, signed the CA Final Examination results held in November 2024, today, 26th December 2024, in Delhi. #ICAIat75 #icairesults pic.twitter.com/Zssd2RR5ZJ
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) December 26, 2024
హైదరాబాద్కి చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ ఇద్దరూ సంయుక్తంగా 508 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సీఏ గ్రూప్-1 ఎగ్జామ్స్ ఈ ఏడాది నవంబర్ 3, 5, 7వ తేదీల్లో జరిగాయి. ఇక గ్రూప్ 2కు నవంబర్ 9, 11, 13, 14 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు ప్రతి విభాగంలో 40 శాతం, మొత్తంగా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://icai.nic.in/caresult/ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ వంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని ఐసీఏఐ తెలిపింది.








