రేవంత్ బీజేపీలో క‌లుస్తారేమో! – బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

రేవంత్ బీజేపీలో క‌లుస్తారేమో! - బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

ఇటీవల తెలంగాణ (Telangana) పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ(BJP MP) అర్వింద్‌ (Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. “మోదీ, రేవంత్ రెడ్డికి ఏమన్నా లింక్ ఉందేమో నాకైతే తెలవదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అసలేం జరిగింది?
ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా హెచ్‌ఐసీసీ (HICC)లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, వేదికపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని చూస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి.. మీరు మాతో కలవండి. గత పదేళ్లలో గుజరాత్‌కు (Gujarat) ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు తెలంగాణకు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అంటూ ప్రధాని మోదీ బహిరంగంగానే ఆఫర్ ఇచ్చారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారం రేపాయి.

సువేందు అధికారి లాగా కలుస్తారేమో!
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తనదైన శైలిలో స్పందించారు. “మొన్న మోదీ రేవంత్ రెడ్డితో ‘నాతో కలువు’ అని చెప్పారు. మరి వాళ్లిద్దరికీ లోపల ఏమన్నా లింక్ ఉందేమో నాకైతే తెలవదు.. ఎందుకంటే నేను బీజేపీలో(BJP) చాలా చిన్న కార్యకర్తను. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని (Mamata Banerjee) వీడి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారి లాగా రేవంత్ రెడ్డి కూడా కలుస్తారేమో? అందుకే నాతో కలిసి పనిచెయ్ అని మోదీ రేవంత్ రెడ్డితో అని ఉండొచ్చు” అని ఎంపీ అర్వింద్ అన్నారు.

అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలను ఉద్దేశించి కూడా అర్వింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. “మా నాయన (డి.శ్రీనివాస్) గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశారు. జీవితాంతం పారదర్శకంగా కాంగ్రెస్‌లోనే ఉంటూ, మాట మీద నిలబడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) లేదా శ్రీధర్ బాబు (Sridhar Babu) లాంటి సీనియర్ నేతలను ముఖ్యమంత్రిని చేసినా బాగుండేది. అలాంటి వారికి కేవలం ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే సరిపోదు” అంటూ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment