గోపిచంద్ ‘భరతవర్ష’ గ్లింప్స్ రిలీజ్

గోపిచంద్ ‘భరతవర్ష’ గ్లింప్స్ రిలీజ్

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 33వ చిత్రంపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్రానికి ‘భరతవర్ష’ (Bharatvarsha) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను (Powerful Title) ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను (Glimpse) విడుదల చేశారు.టైటిల్‌కి తగ్గటుగానే గ్లింప్స్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) తన గత సినిమాల తరహాలోనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

కాగా గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక పీరియాడిక్ లేదా మైథాలజీ నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. గోపీచంద్ లుక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. దేశ చరిత్రలో ఎవరికీ తెలియని ఒక అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో తన సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి, ఈసారి గోపీచంద్‌ను ఒక భారీ కాన్వాస్‌పై ఆవిష్కరిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి (Srinivas Chitturi) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుదీప్ దేవ్ (Anudeep Dev) అందిస్తున్న సంగీతం గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్‌కు ‘భరతవర్ష’ రూపంలో ఒక సాలిడ్ హిట్ పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment