ఇటీవల గాయపడిన ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ (BCCI) వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో.. ఫిట్‌నెస్(Fitness) విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై(Fitness) పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే జాతీయ జట్టులో అతడి పేరును ఖరారు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అఫ్గానిస్థాన్‌తో(Afghanistan) జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు అస్టరిస్క్ మార్క్ పెట్టడం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఆటగాళ్లు ఎంపికైన తర్వాత ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సిరీస్‌లకు దూరమవుతున్న ఘటనలు పునరావృతం కాకుండా.. ఇకపై 100 శాతం కాదు, 200 శాతం ఫిట్‌నెస్‌పై నమ్మకం వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ(BCCI) భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(BCCI Centre of Excellence)కూడా గాయాల నుంచి కోలుకుంటున్న ఆటగాళ్లను తొందరపడి మైదానంలోకి దింపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే అంతర్జాతీయ సిరీస్‌లకు సాధారణంగా మూడు నుంచి నాలుగు వారాల ముందే జట్టును ప్రకటించాల్సి ఉండటంతో.. ఆ సమయంలో పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న ఆటగాళ్లను ‘సబ్జెక్ట్ టు ఫిట్‌నెస్’(Subject to Fitness) షరతుతో ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఎంపికైన తర్వాత 21 నుంచి 28 రోజుల వ్యవధిలో ఆటగాడు పూర్తిగా కోలుకుంటే సిరీస్‌కు పంపించే అవకాశం ఉంటుంది. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరగనుండగా.. బుమ్రా(Jasprit Bumrah), నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్‌నెస్‌లో పురోగతి సాధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వైద్య బృందం పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే వీరి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.








