250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు అధికారిక హోదా

250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు అధికారిక హోదా

Summarize with AI

అమెరికా బాల్డ్ ఈగల్‌కు ఆ దేశ జాతీయ పక్షిగా అధికారిక హోదా లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేసి, ఈ చారిత్రక నిర్ణయానికి పునాది వేశారు. దీన్ని 1782 నుంచి అమెరికా అధికార చిహ్నంగా ఉపయోగిస్తూనే ఉన్నా, ఇప్పటివరకు అధికారిక హోదా మాత్రం లేకుండా పోయింది.

డిసెంబర్ 16న మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్ ప్రవేశపెట్టిన బిల్లును సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అధ్యక్షుడు బైడెన్ సంతకంతో, దాదాపు 250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌ అధికారిక జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది.

మొట్టమొదటి చిహ్నం
బాల్డ్ ఈగల్ ఉత్తర అమెరికాకు చెందిన ప్రత్యేక పక్షి. మొదటిసారి 1776లో మసాచుసెట్స్ రాగి సెంటుపై ఈగల్‌ అమెరికా చిహ్నంగా కనిపించింది. ఆ తర్వాత డాలర్ నాణేలు, వెండి డాలర్, హాఫ్ డాలర్, క్వార్టర్ వంటి నాణేల వెనుక భాగంలో కూడా చోటు సంపాదించింది. బంగారు నాణేలకు కూడా ఈగల్ పేరును ఉపయోగించారు, వీటిలో డబుల్ ఈగల్ వంటి పేర్లు చేర్చారు.

ప్రత్యేకమైన రక్షణ చట్టం
1940లో జాతీయ చిహ్న చట్టం కింద బాల్డ్ ఈగల్‌ను రక్షిత పక్షిగా గుర్తించారు. దాని విక్రయాలు చట్టవిరుద్ధం. ‘‘ఈ పక్షి, దశాబ్దాలుగా అమెరికా చిహ్నంగా నిలుస్తోంది. ఇప్పుడు దానికి శాసన హోదా లభించడం ఎంతో గర్వకారణం’’ అని నేషనల్ ఈగల్ సెంటర్‌ ప్రతినిధి జాక్ డేవిస్ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment