‘పోర్టుల’ పరిధి కుదింపు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త‌

‘పోర్టుల’ పరిధి కుదింపు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త‌

ఎన్నికల (Elections) సమయంలో “సంపద సృష్టిస్తా (Wealth Create).. ఆ సంపదను ప్రజలకు (People) పంచుతా” అంటూ నినాదాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు (Nara Chandrababu Naidu).. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలో సంపద సృష్టి దేవుడెరుగు కానీ, ప్రతి మంగళవారం కొత్త అప్పులు (New Loans) తెస్తూ దేశంలోనే అప్పుల్లో ఏపీని (Andhra Pradesh) కొత్త రికార్డుల వైపు నడిపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ప్రజాధనంతో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆస్తులైన మెడికల్ కాలేజీలు(Medical Colleges), జిల్లా రహదారులు (Roads), పోర్టులను (Ports) కార్పొరేట్(Corporate),, ప్రైవేట్ (Private) శక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకు ప్రభుత్వ వైద్య కళాశాలలపై పడిన సర్కారు కన్ను.. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాలకు గుండెకాయ లాంటి పోర్టులపై పడింది.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న మచిలీపట్నం(Machilipatnam), రామాయపట్నం (Ramayapatnam) పోర్టుల పరిధిని నిబంధనలకు విరుద్ధంగా కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) నిర్ణయం తీసుకుంది. ‘రేషనలైజేషన్’ (Rationalization) పేరుతో క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసి, దానికి అనుగుణంగా జీవోలను కూడా జారీ చేసింది. అయితే ఈ పరిధి కుదింపు వెనుక అధికార పక్షానికి చెందిన బినామీల ప్రయోజనాలు దాగున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ (YSR Congress Party Government) హయాంలో మచిలీపట్నం పోర్టుకు 64 కి.మీ, రామాయపట్నం పోర్టుకు 51 కి.మీ మేర నోటిఫైడ్ పరిధిని (Notified Limits) కేటాయించారు. పోర్టుల పరిధి ఎంత ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో ఆయా పోర్టుల ఆధారిత పరిశ్రమల విస్తరణకు, ప్రభుత్వ ఆధీనంలో జోన్ల ఏర్పాటుకు అంతగా అవకాశాలు ఉంటాయి.

కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండు పోర్టుల పరిధిని కేవలం 15 కిలోమీటర్లకే పరిమితం చేసింది. ఇంత భారీగా తీరప్రాంత పరిధిని తగ్గించడం వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని విపక్షాలు, ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. పోర్టుల సమీపంలో ఉండే వేల కోట్ల విలువైన తీరప్రాంత భూములను, వాణిజ్య అవకాశాలను తెలుగుదేశం పార్టీ(TDP) బినామీలకు, ప్రైవేట్ కంపెనీలకు రాసిచ్చేందుకే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు తారాస్థాయికి చేరాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై కోస్తా తీరప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజా సంక్షేమానికి ఉప‌యోగ‌ప‌డే ఎలాంటి కొత్త నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని చూడడం అన్యాయమంటున్నారు.

నిరంతరం అప్పులు తీసుకురావడం, రాష్ట్ర సంపదనంతా ప్రజలకు ఫలితాలు ఇవ్వని చోట్ల కేంద్రీకరించడం (Concentrating) వల్ల సామాన్యుడికి ఒరిగేది ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం పున‌రాలోచించుకొని, పోర్టుల ప‌రిధిని య‌ధావిధిగా కొన‌సాగిస్తే మ‌త్స్య‌కారులకు మేలు చేసిన వారు అవుతార‌ని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment