సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న చందంగా పాఠశాలలను అభివృద్ధి చేసింది ఒకరైతే.. దానిని తమదిగా ప్రచారం చేసుకునేవారు మరొకరు అయ్యారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు-నేడు ప్రోగ్రాంతో చేసిన మంచిపనిని కూటమి ప్రభుత్వం తమదిగా చెప్పుకోవడం వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. అంతేకాదు.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యంతో పాటు కూటమిపై అసహ్యాన్ని తెప్పిస్తోంది. పిల్లలు వేసుకునే షూ దగ్గర్నుంచి.. తినే తిండి వరకు క్వాలిటీతో ఉండాలని తపన పడడం అస్తవ్యస్తమా..? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ పాలనలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారంటూ పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాను అధికారం ఉండగా ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్నారా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మన తాతల కాలం నాటి స్కూళ్లన్నీ శిథిలావస్థకు చేరితే వాటిని నాడు-నేడుతో బాగు చేయించి, విరిగిపోయి మూలకు చేరిన చెక్క బేంచీల స్థానంలో హైక్వాలీటీ స్టాండెడ్ డ్యూయల్ డెస్క్ బెంచీలు తెచ్చి, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బైలింగ్వల్ టెస్ట్ బుక్స్ తెచ్చింది తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అని గుర్తుచేస్తున్నారు.
చెరగని @ysjagan ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్లు
— Telugu Feed (@Telugufeedsite) July 10, 2025
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌ను సందర్శించిన సీఎం @ncbn, మంత్రి @naralokesh
బెంచీలకు @YSRCParty హయాంలో చేపట్టిన నాడు-నేడు 2021 కనిపించకుండా ''మన బడి – మన భవిష్యత్తు'' స్టిక్కర్లు… pic.twitter.com/DTwZjk8WrH
ఇవాళ మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సందర్శించిన పాఠశాలను నాడు-నేడు పథకంలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరిచారని గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాక, చంద్రబాబు, లోకేష్ కూర్చున్న బెంచీలు జగన్ హయాంలోనే ఏర్పాటు చేసినవే, ఈరోజు విద్యార్థుల పాఠ్యాంశాల బోధనకు ఉపయోగిస్తున్న డిజిటల్ బోర్డు కూడా నాడు-నేడు పుణ్యమేనని చెబుతున్నారు. మరి ఇది అభివృద్ధి కాదా చంద్రబాబూ అని సీఎంను నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా.. చంద్రబాబు ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడ్డం ఏంటని, దీనిని అస్తవ్యస్తం అంటామా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక, వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మ ఒడి పథకం పేరు మార్చి, ఇప్పుడు తల్లికి వందనం పేరుతో అదే పథకాన్ని కొనసాగిస్తున్నారని, తల్లికి వందనం పథకం లోకేశ్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని గతంలో చంద్రబాబు మాట్లాడి దారుణంగా ట్రోల్ అయ్యారని గుర్తు చేసుకుంటున్నారు. నాడు-నేడు కనిపించకుండా స్టిక్కర్లు అంటించి, విద్యార్థుల కోసం తెచ్చిన పథకాల పేర్లు మారిస్తే జగన్ చేసిన మంచిని తుడిచేయొచ్చు అనుకోవడం అవివేకమని, ఇకనైనా విద్యా వ్యవస్థపై అబద్ధాలు మాట్లాడి అభాసుపాలు కావొద్దని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు
— Telugu Feed (@Telugufeedsite) December 5, 2025
లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు
– సీఎం చంద్రబాబు https://t.co/if9KmQALMY pic.twitter.com/gnCj2SjnhV








