ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే!

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 30 ఎజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, త్వ‌ర‌లో జ‌ర‌గబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి వచ్చే బిల్లులకు సైతం అనుమతి తెలిపిన‌ట్లుగా స‌మాచారం. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్ర‌వ‌ర్గం ఆమోదం లభించనుంది.

కేబినెట్ భేటీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెల‌ప‌నున్నారు. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అమలయ్యే ఈ విధానంలో ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు లభిస్తాయి. దీని కింద 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో 32,257 చికిత్సలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. రూ.2.5 లక్షల లోపు ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తే, రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నిర్వహించనుంది. ప్రీ-ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా 6 గంటల్లోనే చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా నూతన విధానం అమలులోకి రానుంది.

కేబినెట్ ముఖ్యాంశాలు

  • అతిథ్య హోటళ్లకు ప్రోత్సాహకాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్..
  • సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది.
  • గతేడాది వరద ముంపు మరమ్మతులకు రూ.57.58 కోట్లు మంజూరుకు ఆమోదం..
  • ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం
  • వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
  • కుప్పంలో దాదాపు రూ.586 కోట్ల పెట్టుబడిలో హిందాల్కో పరిశ్రమ ఆమోదం.
  • వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
  • గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ పాలసీకి ఆమోదం తెలపనున్న కేబినెట్.
  • స్కెరూట్ ఏరోస్పేష్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు గ్రీన్ సిగ్నల్..
  • ప్రైవేటు వర్సిటీల చట్టంలో పలు సవరణలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.

Join WhatsApp

Join Now

Leave a Comment