ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, దాదాపు 13 బిల్లుల (Bills) ప్రతిపాదనలకు కేబినెట్ (Cabinet) ఆమోదం (Approval) తెలిపింది.
కేబినెట్ ఆమోదించిన ప్రధాన నిర్ణయాలు
- నాలా ఫీజు రద్దు సంబంధించిన చట్టాలను సవరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును “తాడిగడప మున్సిపాలిటీ”గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.
- రాజధానిలో అమలు చేయబోయే పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రత్యేక వాహక నౌకల ఏర్పాటు ప్రతిపాదన ఆమోదం పొందింది.
- ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీల ఖరారు ప్రతిపాదన ఆమోదం పొందింది.
- రాజధాని పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
- చిన్న పరిశ్రమల ఏర్పాటుకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
- ఏపీ జీఎస్టీ బిల్లు 2025 సవరణల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.








