నేడు ఏపీలో ‘ఆక్వా బంద్’.. రోడ్డెక్కనున్న రైతులు, డీలర్లు

నేడు ఏపీలో ‘ఆక్వా బంద్’.. రోడ్డెక్కనున్న రైతులు, డీలర్లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఆక్వా రంగం(Aqua Sector) తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఫీడ్ కంపెనీల (Feed Companies) సిండికేట్ మాయాజాలం, భారీగా పెరిగిన ధరలకు నిరసనగా నేడు (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా “ఆక్వా బంద్” (Aqua Bandh) కు ఏపీ ఆక్వా రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు ఆక్వా డీలర్లు (Aqua Dealers), షాపుల యజమానులు సైతం పూర్తి మద్దతు ప్రకటించడంతో ఆక్వా బెల్ట్‌గా (Aqua Belt) పేరొందిన తీరప్రాంత జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఆక్వా రైతు సంఘం (Aqua Farmers Association) పిలుపు మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో(Ponds) రొయ్యలు (Shrimp), చేపల (Fish) పట్టుబడులను రైతులు పూర్తిగా నిలిపివేయనున్నారు. పట్టుబడులు ఆగిపోవడంతో ప్రాసెసింగ్ ప్లాంట్లు, రవాణా రంగానికి కూడా బంద్ సెగ తగలనుంది.

ఈసారి కేవలం రైతులే(Farmers) కాకుండా, ఆక్వా డీలర్లు మరియు మేత విక్రయదారుల సంఘాలు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా ఫీడ్ డీలర్లు తమ మేత విక్రయాలను నిలిపివేసి, షాపులను మూసివేశారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలోని ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం వంటి ప్రధాన ఆక్వా నియోజకవర్గాల్లో ఫీడ్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి.

పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే తగ్గించాలి. అంతర్జాతీయ మార్కెట్ నెపంతో రొయ్యల కొనుగోలు ధరలను తగ్గించకుండా ‘ధరల స్థిరీకరణ’ చేయాలి. ఫీడ్ సిండికేట్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఆక్వా ఫీడ్ కంపెనీలు టన్ను మేతపై అదనంగా ఏకంగా రూ.10,000 నుండి రూ.12,000 వరకు పెంచడంపై గత నెల రోజులుగా ఆక్వా రైతులు(Aqua Farmers) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జోక్యం చేసుకుని, ఫీడ్ ధరను కేజీకి రూ.12 నుండి రూ.8 కి తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఆయా కంపెనీలు ప‌ట్టించుకోలేదు.

అయితే, ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన ఫీడ్ కంపెనీలు.. కేజీకి కేవలం రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులుపుకున్నాయి. కంపెనీల ఈ మొండి వైఖరిపై రైతులు, డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మేత ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు మార్కెట్‌లో రొయ్యల ధరలను అమాంతం తగ్గించేయడంతో తాము కోలుకోలేని విధంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన ఫీడ్ సిండికేట్ మాయాజాలంపై ఆక్వా రైతులు పలుమార్లు రోడ్డెక్కి నిరసనలు తెలిపినప్పటికీ, కూటమి ప్రభుత్వం దీనిపై ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment