ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పేదల పాలిట వరప్రదాయినిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి (Aarogyasri scheme) గ్రహణం పట్టనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం కింద వైద్య సేవలను (Medical Services) నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ (Private Hospitals Association) ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ (Chandrababu Government) నిర్ణయాలకు నిరసనగా, పెండింగ్ బకాయిల చెల్లింపు కోరుతూ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
రూ. 3000 కోట్ల బకాయిలు.. పెరిగిన ఆర్థిక భారం
ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు అందాల్సిన బకాయిలు (Dues) కొండలా పేరుకుపోయాయని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత నాలుగు నెలల్లోనే ఈ బకాయిలు రూ. 2500 కోట్ల నుంచి రూ. 3000 కోట్లకు చేరుకున్నాయని వారు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడంతో చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడే స్థితికి చేరుకున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ (Dr. Vijay Kumar) ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC)పై అభ్యంతరాలు
ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న ఇన్సూరెన్స్ మోడల్ (UHC)పై ఆసుపత్రుల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా 2017 నాటి ధరలనే ఇప్పటికీ కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన వైద్య ఖర్చులు, నిర్వహణ భారాన్ని పాత రేట్లతో భరించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. పాత బకాయిలను తేల్చకుండా కొత్త ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మారితే, పేరుకుపోయిన రూ. 3000 కోట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఆసుపత్రుల ప్రధాన ప్రశ్నగా మారింది.
ప్రభుత్వానికి అల్టిమేటం
ప్యాకేజీ ధరలను (Package Prices) సవరించి, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆసుపత్రుల సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే ఏప్రిల్ 1 నుంచి సేవలు నిలిపివేయడమే కాకుండా, రోడ్డెక్కి పోరాడతామని హెచ్చరించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేద రోగులకు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.








సుగాలి ప్రీతి కేసును పవన్ రాజకీయానికి వాడుకున్నాడు