అనకాపల్లిలో ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్

అనకాపల్లిలో విద్యార్థులు మిస్సింగ్..

అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని రాంబిల్లి (Rambilli) మండలంలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు (10th Class Students) అదృశ్యమైన (Missing) సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. రాంబిల్లి (Rambilli) BCT ఉన్నత పాఠశాలలో (BCT High School) చదువుతున్న ఈ విద్యార్థులు నిన్న మధ్యాహ్నం స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి చేరకపోవడంతో కుటుంబాలు కలత చెంది పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పిల్లలు కనిపించకుండా పోయిన విషయాన్ని ముందుగా తమకు తెలియజేయలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. రాంబిల్లి బస్టాండ్, సమీప రైల్వే స్టేషన్ ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ విద్యార్థులు ఎక్కడికి వెళ్లి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమ పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతుండగా, విద్యార్థులను సురక్షితంగా కనుగొనేపై పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ నుంచి పారిపోయిన విద్యార్థుల పేర్లు‍‍ డి. జస్వంత్, ఎం. హిమతేజ, ఎస్. భరత్, బి లక్ష్మణరావు, పి. వరుణ్, యు. రాజారావు

Join WhatsApp

Join Now

Leave a Comment