ఐసీపీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో నేడు సంచలన మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాల సమరం మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎక్కడ లేని సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ ఫీవర్ రెట్టింపు అయ్యింది.
ICC టోర్నమెంట్స్‌లో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి. కానీ ఛాంపియన్ ట్రోఫీలో గణాంకాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా-పాకిస్తాన్ జట్లు ఐదుసార్లు తలపడగా, పాక్ 3 సార్లు గెలిచింది. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా పాకిస్తాన్‌ను ఈజీగా చిత్తుచేయగలదని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు దాయదీల సమరం ప్రారంభం కానుంది.
టీమిండియా గెలవాలని పూజలు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ గెలుపు కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతంలో పూజ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.