అజిత్ కుటుంబంలో మరో విషాదం..

అజిత్ కుటుంబంలో మరో విషాదం..

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) తల్లి (Mother) మోహిని (Mohini) (84) శనివారం చెన్నైలోని (Chennai) తన నివాసంలో కన్నుమూశారు(Passed Away). వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

అజిత్ కుటుంబాన్ని మరోసారి విషాదం కమ్ముకుంది. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి (Father) పి. సుబ్రమణ్యం (P. Subramaniam) కూడా వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. ఇప్పుడు తల్లి మోహిని మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మోహిని మృతిపై తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అభిమానులు మోహినికి నివాళులు అర్పిస్తూ అజిత్ కుటుంబానికి మద్దతుగా సందేశాలు పోస్టు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment