ఏబీడీ రీఎంట్రీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి

ఏబీడీ రీఎంట్రీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి

Summarize with AI

సౌతాఫ్రికా క్రికెట్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టబోతున్నారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ (Legends League)లో సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్, 2021 వరకు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడి ప్రేక్షకులను అలరించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్‌గా పనిచేస్తూ, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మ్యాచ్ విశ్లేషణలతో అభిమానులను ఉర్రూతలూగించారు.

ఏబీ డివిలియ‌ర్స్ త‌న రీఎంట్రీతో అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందించనున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఆయన మళ్లీ మ్యాజిక్ చేయడం ఖాయమ‌ని క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment