హోలీతో మూవీ ప్ర‌మోష‌న్స్‌.. వీడియో వైర‌ల్‌

మూవీ ప్రమోషన్స్‌లోనే కలర్‌ఫుల్ సెలెబ్రేషన్

ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు కాంబోలో నిర్మించిన చిత్రం త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్‌తో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ అంతా బిజీగా ఉంది. ఇందులో యాంక‌ర్‌ దీపికా పిల్లి ప్రధాన పాత్రలో నటిస్తోంది. మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ప్ర‌దీప్‌-దీపిక ఇద్దరూ కలిసి హొలీ వేడుకలను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు.

హొలీ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రదీప్-దీపికా కలిసి కలర్‌ఫుల్ మూడ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్లు “బెస్ట్ జోడీ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి హైప్ ఉండగా, ఈ హొలీ సెలెబ్రేషన్ సినిమాకు మరింత ప్రచారం కలిగించిందనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment