38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డ్

38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డ్

Summarize with AI

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్‌లో రకరకాల ఛాలెంజ్‌లు, స్టంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని అసాధారణమైన ఓపిక, పట్టుదలను పరీక్షించేలా ఉంటాయి. తాజాగా యూట్యూబర్ ‘నార్మే’ చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షించింది. 38 గంటల పాటు కదలకుండా నిలబడి సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నార్మే
38 గంటల పాటు ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడటం ఎంత క్లిష్టమైందో ఊహించడమే కష్టం. శరీరాన్ని పూర్తిగా స్థిరంగా ఉంచడం కోసం ఎంతో మానసిక స్థైర్యం, అద్భుతమైన సెల్ఫ్ కంట్రోల్ అవసరం. ఈ రికార్డు సాధించే క్రమంలో నార్మే అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. కొంతమంది ఫాలోవర్లు సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పంపుతూ అతన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించగా, మరికొందరు ప్రాంక్స్ చేసి అతన్ని కదిలించాలనుకున్నారు. ఇంకొందరు అతని స్థితిని గమనించి పోలీసులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు. అయినప్పటికీ, నార్మే మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఒక విగ్రహంలా నిలబడి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.

ఓపికకు ప్రతిరూపం
ఈ రికార్డ్ సాధనకు నార్మే ఎంతో కష్టపడ్డాడు. శరీరం మాత్రమే కాకుండా మనసును కూడా పూర్తిగా ఆధీనంలో ఉంచుకుకోవ‌డం ద్వారా ఈ ఘనత సాధించగలిగాడు. డిస్ట్రాక్షన్స్‌ను పట్టించుకోకుండా, డిసిప్లిన్‌తో 38 గంటల పాటు నిశ్చలంగా నిలబడటం మామూలు విషయం కాదు. అంతకుమించి, నార్మే చేసిన ఈ సాహసం వైరల్ అవడంతో లక్షలాది మంది అతని లైవ్ స్ట్రీమ్‌ను ఆసక్తిగా వీక్షించారు. చివరకు తన పట్టుదలతో ప్రపంచ రికార్డులో చోటు సంపాదించి, అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment