ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

Summarize with AI

శాఖపట్నం భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్‌జడ్ (Coastal Regulation Zone) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన గోడపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై హైకోర్టు మండిపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించింది.

పర్యావరణ నష్టం..
గోడ తొలగించిన తర్వాత ఆరు అడుగుల పునాది అలాగే వదిలేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి గోడ వల్ల జరిగిన పర్యావరణ నష్టాన్ని అంచనా వేయాలని కోర్టు ఆదేశించింది. గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణ నష్టాన్ని నేహా రెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.

అక్రమ రెస్ట్రో బార్లపై విచారణ
భీమిలి బీచ్ పరిసరాల్లో నలుగురు రెస్ట్రో బార్ల అక్రమ నిర్వహణపై దాఖలైన పిల్ పైనా హైకోర్టులో విచారణ జరిగింది. కమిటీని నియమించి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలనే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment