అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి ఉక్రెయిన్‌కు (Ukraine) ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందజేస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఖనిజాల ఒప్పందంపై ఈ చర్చ వేడెక్కగా, ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్ అధికారి వెల్లడించారు. రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి ఇవ్వాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేయగా, ట్రంప్ ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందంపై ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో జెలెన్‌స్కీ సమావేశం నుంచి అర్థంతరంగా బయటకు వెళ్లిపోయారు.
ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్దతు
జర్మన్ పరిశోధన సంస్థ కీల్ ఇనిస్టిట్యూట్ ప్రకారం 2022 నుంచి 2024 వరకు ఉక్రెయిన్‌కు అమెరికా 119.8 బిలియన్ డాలర్ల సాయం అందించగా, ఐరోపా దేశాలు 132.3 బిలియన్ యూరోలు అందించాయి. ఇప్పుడు అమెరికా మద్దతు తగ్గిపోవడంతో ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెరగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.