గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌.. – సీఎం రేవంత్‌

గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌.. - సీఎం రేవంత్‌

హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైద‌రాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌ను కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చే దిశగా తాము వేగంగా ముందుకెళ్తున్నామ‌ని సీఎం వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా నగరం రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ విశేషాలు
వ‌న్‌ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విదేశీ విద్యాసంస్థలతో కలిసి పని చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్‌ఎంఈలు ఫార్మా రంగంలో అభివృద్ధికి ప్రభుత్వ సహకారాన్ని పొందుతున్నాయని, ఏఐ, క్వాంటమ్, రోబోటిక్స్ ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు.

ఉద్యోగాలు, పెట్టుబడుల పెరుగుదల
తెలంగాణ దేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధితో హైదరాబాద్ శివారుల్లో కొత్త పరిశ్రమలు, టెక్ హబ్‌లు ఏర్పడుతున్నాయన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment