తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని ఆరోపించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో అనేక స్కామ్‌లు చేసినా కేంద్రం నుంచి స్పందన లేకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు.
సుంకిశాల ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం వంటి కీలక ఘటనలపై కేంద్రం ఎందుకు నిశ్బంధంగా ఉందని ప్రశ్నించారు. రూ.1337 కోట్ల అమృత్ పథకం స్కామ్ వివరాలు కేంద్రానికి అందించినా చర్యలు లేకపోవడం రేవంత్ రెడ్డి- బీజేపీ లొంగుబాటు ఒప్పందానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి డబ్బులు వసూళ్లు అయినా కూడా బీజేపీ మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు.
సరైన సమయంలో BJPలోకి?
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ సరైన సమయంలో బీజేపీలో చేరుతానని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలుస్తున్నారని విమర్శించారు.








