ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పాముల కలకలం.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పాముల కలకలం.. ముగ్గురు అరెస్ట్

Summarize with AI

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో కస్టమ్స్ అధికారులు (Customs Seizure) భారీగా అటవీ వ‌న్య‌ప్రాణుల‌ అక్రమ రవాణా (Wildlife Trafficking)ను అడ్డుకున్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి 1:30 గంటల స‌మ‌యంలో ముగ్గురు వ్యక్తులు విదేశీ అరుదైన పాముల‌ను అక్రమంగా(Snake Smuggling) దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి..
ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 303 ద్వారా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అనేక అరుదైన వన్య‌ప్రాణులు వారి బ్యాగుల్లో బయటపడ్డాయి.

5 కార్న్ పాములు, 8 మిల్క్ పాములు, 9 బాల్ పైథాన్ పాములు, 4 బియర్డెడ్ డ్రాగన్ చిపకిళ్లు, 7 క్రెస్టెడ్ గెకో చిపకిళ్లు, 11 కామెరూన్ డ్వార్ఫ్ గెకోలు, 14 అరుదైన కీటకాలు, 1 పెద్ద సాలీడు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న అరుదైన వ‌న్య‌ప్రాణుల్లో ఉన్నాయి.

దర్యాప్తులో వేగం
అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన ఈ అరుదైన జీవాలను సంబంధిత అటవీ శాఖకు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఇలాంటి అక్రమ రవాణా ఘటనలు గతంలో కూడా నమోదయ్యాయి. బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ ఘటనల తర్వాత ఇప్పుడు అరుదైన అటవీ జీవాల అక్రమ రవాణా కలకలం రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment