కేథలిక్ ప్రపంచానికి అధిపతిగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఆరోగ్యం తీవ్ర విషమంగా మారింది. 88 ఏళ్ల పోప్ ఈనెల 14వ తేదీన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా రోమ్‌లోని గెమిల్లీ ఆస్పత్రిలో చేరారు. అయితే శనివారం ఆయన శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో హై ఫ్లో ఆక్సిజన్ (High-flow oxygen) అందిస్తున్నారు.
వైద్యులు అనీమియా సమస్యను గుర్తించి రక్త మార్పిడి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం కంటే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది అని వాటికన్ అధికారిక ప్రకటన తెలియజేసింది. న్యూమోనియా కారణంగా శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరిందని వైద్యులు తెలిపారు. పోప్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని, మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు.
పోప్ ఫ్రాన్సిస్ జీవిత ప్రయాణం
జార్జ్ మారియో బెర్గోగ్లియో (Jorge Mario Bergoglio) అనే అసలు పేరుతో 1936లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించిన ఫ్రాన్సిస్ 2013లో కేథలిక్ చర్చి అధిపతిగా ఎంపికయ్యారు. దక్షిణార్ధ గోళం నుంచి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి అనే గౌరవం ఫ్రాన్సిస్‌దే.
2013లో పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామా చేసిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది, మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు లూగీ కార్బొన్ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.