హోలీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో బాలీవుడ్ డైరెక్టర్

హోలీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో బాలీవుడ్ డైరెక్టర్

బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హోలీ పండుగ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పండుగను తక్కువ స్థాయి వారు చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. హిందువులను కించపరిచేలా ఆమె మాట్లాడార‌ని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై ముంబైకి చెందిన ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా, ఫరా ఖాన్‌పై కేసు నమోదైంది. మరోవైపు, సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫరా వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment