విశాఖపట్టణానికి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల చేస్తున్నారని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయని, ఇవేం దిక్కుమాలిన పనులంటూ నానిపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్యుయన్సర్లు ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండొద్దని హెచ్చరించారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది అమాయకులను బెట్టింగ్ భూతానికి బానిసలను చేస్తున్నారని, ఇది ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. చట్టప్రకారం శిక్షలు తప్పవని మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. నానిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ, విశాఖ సిటీ పోలీస్‌లను సజ్జనార్ కోరారు. గతంలో భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పైనా సజ్జనార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.







