17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్

17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తీపిక‌బురు అందించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సంస్థ లాభాల్లోకి(Profits) ప్రవేశించింది. 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల లాభాన్ని నమోదు చేయడం విశేషం. చివరి సారిగా 2007లో లాభాలను నమోదు చేసిన ఈ సంస్థకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

వృద్ధి వెనుక కారణాలు
బీఎస్‌ఎన్‌ఎల్ తన సేవలను విస్తరించడంతో పాటు, మొబిలిటీ, ఎఫ్‌టీటీహెచ్ (Fiber-to-the-Home), లీజ్డ్ లైన్ విభాగాల్లో 14-18 శాతం వృద్ధిని సాధించిందని సింధియా వెల్లడించారు. గత జూన్‌లో 8.4 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నప్పటికీ, డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 9 కోట్లకు పెరిగింది.

4G విస్తరణ – టెలికాం రంగంలో కొత్త దశ
దేశవ్యాప్తంగా 4G నెట్‌వ‌ర్క్(BSNL 4G Expansion) కోసం లక్ష టవర్లలో 75,000 టవర్ల ఇన్‌స్టలేషన్ పూర్తయింది, ఇందులో 60,000 టవర్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. జూన్ 2024 నాటికి అన్ని టవర్లు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని మంత్రి తెలిపారు. గత నాలుగేళ్లలో బీఎస్‌ఎన్‌ఎల్ EBITDA (ఆపరేటింగ్ లాభం) రూ.1,100 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు రెట్టింపైంది, ఇది సంస్థ స్థిరంగా ముందుకు సాగుతున్న సంకేతాలుగా సూచిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment