బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కండల వీరుడి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “సాధారణంగా నేను రోజుకు కేవలం 2 గంటలే నిద్రపోతాను. కానీ నెలకోసారి 8 గంటలు పూర్తి నిద్ర తీసుకుంటాను. కొన్ని సందర్భాల్లో, షూటింగ్ మధ్య విరామాల్లో కాసేపు కునుకు తీస్తాను. అయితే, షూటింగ్ లేనప్పుడు లేదా ఖాళీ సమయం ఉన్నప్పుడు మాత్రం తగినంత విశ్రాంతి తీసుకుంటాను” అని వెల్లడించారు.
రోజుకు కేవలం 2 గంటలే నిద్రపోతాను.. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయా. ఒకవేళ విమాన ప్రయాణం చేసే ఆ ఫ్లైట్‌లో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా సరే నేను మాత్రం నిద్రపోతాను అంటూ కామెంట్ చేశారు. సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.