‘తండేల్’ మూవీ కలెక్షన్ల సునామీ

‘తండేల్’ మూవీ కలెక్షన్ల సునామీ

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ఈ మూవీ, కేవలం రెండ్రోజుల్లోనే రూ.41.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డులు నెలకొల్పుతోంది.

మేకర్స్ ‘బ్లాక్‌బస్టర్ లవ్ సునామీ’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఈ విజయంపై చైతూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ విశ్లేషకుల ప్రకారం.. ఇది నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం హాలిడే కావడంతో వసూళ్లు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.

తండేల్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది. బుజ్జిత‌ల్లి పాట‌కు దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్ హృద‌యాల‌ను మెలిపెడుతోందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా మ్యూజిక్ ల‌వ‌ర్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment