అంబానీ గ్యారేజీలోకి ఖరీదైన రోల్స్ రాయిస్

అంబానీ గ్యారేజీలోకి ఖరీదైన రోల్స్ రాయిస్

భారతదేశంలోని బ‌డా పారిశ్రామిక వేత్త, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన గ్యారేజీకి మరో విలాసవంతమైన కారును జతచేశారు. ఆయన తాజాగా దేశంలో ఎవరికీ లేని రోల్స్ రాయిస్ (Rolls Royce) కల్లినన్ బుల్లెట్ ప్రూఫ్ కారు(Bullet proof Car) ను కొనుగోలు చేశారు.

ఈ కారు అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారైంది. బాంబు దాడులను కూడా తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ కారుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర సుమారు రూ. 8 కోట్లు కాగా, అంబానీ తన ప్రత్యేక అవసరాల మేరకు కస్టమైజ్ చేయించడంతో దీని ఖర్చు రూ. 13 కోట్ల వరకు చేరిందని సమాచారం. అంబానీ కార్ల కలెక్షన్‌లో ఇప్పటికే అనేక విలాసవంతమైన కార్లు ఉన్నప్పటికీ, ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment