ఢాకాలో అల్లర్లు.. షేక్ ముజిబుర్ నివాసానికి నిప్పు

ఢాకాలో అల్లర్లు.. షేక్ ముజిబుర్ నివాసానికి నిప్పు

Summarize with AI

బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర అల్లర్లకు వేదికైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని నిరసనకారులు దహనం చేశారు. ఢాకాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అవామీ లీగ్ పార్టీని బహిష్కరించాలనే డిమాండ్‌తో నిరసనకారులు రెచ్చిపోయారు. ఢాకాలోని షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని ముట్టడి చేసి, ఇంట్లోకి చొరబడి సామ‌గ్రిని ధ్వంసం చేశారు. అనంతరం నిప్పంటించారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.

షేక్ హసీనా ఘాటైన స్పందన
ఈ హింసాకాండను షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. “భవనాలను తగలబెట్టవచ్చు, కానీ చరిత్రను మార్చలేరు. చరిత్ర ప్రతీకారం తీర్చుకుంటుంది!” అంటూ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

హింసకు కారణం ఏమిటి?
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనారిటీలపై దాడులు, అవామీ లీగ్ విధానాలపై నిరసనలు కొనసాగుతుండగా, ఈ ఘటన హింసాత్మకంగా మారింది. గురువారం అవామీ లీగ్ పార్టీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment