త్వరలో ‘ఎల్లమ్మ’ నుంచి కొత్త అప్డేట్

త్వరలో ‘ఎల్లమ్మ' నుంచి కొత్త అప్డేట్

Summarize with AI

కామెడీ స్క్రిప్టుల‌తో వేణు వండ‌ర్స్‌తో ఫేమ‌స్ అయిన క‌మెడియ‌న్ వేణు ‘బలగం’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకొని డైరెక్టర్‌గా వేణు పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్లమ్మ’ప్రాజెక్ట్పై ఫోకస్ చేశాడు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా వేణు తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఆసక్తికరమైన హింట్ ఇచ్చాడు.

“సిద్ధమవుతున్నా… త్వరలో అప్డేట్ వస్తుంది” అంటూ ట్వీట్ చేసిన వేణు, జిమ్‌లో కసరత్తు చేస్తున్న తన ఫొటోను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ‘ఎల్లమ్మ’పై మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిలు రాజ్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రానున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి ఎల్ల‌మ్మ‌ పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment